సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (17:35 IST)

చేపల వేటకు తీసుకెళ్లలేదని భర్తను అమ్మకానికి పెట్టిన భార్య...

కట్టుకున్న భర్తను ఓ భార్య అమ్మకానికి పెట్టింది. తన భర్త ఎవరికైనా కావాలంటే కొనుక్కోవచ్చని, కానీ ఎక్చేంజ్ లేదంటూ ఓ క్యాప్షన్ పెట్టి ఆమె ఓ ప్రొఫైల్ సిద్ధం చేసింది. కట్టుకున్న భర్తను ఆమె ఇలా అమ్మకానికి పెట్టడానికి ఓ కారణం ఉంది. రోజూ చేపల వేటకు వెళ్లే భర్తను తనను కూడా చేపల వేటకు తీసుకెళ్లాలని కోరింది. అందుకు ఆయన నిరాకరించాడు. అంతే.. ఆమెకు కోపం వచ్చింది. భర్తను అమ్మకానికి పెట్టేసింది. ఈ ఆసక్తికర సంఘటన న్యూజిలాండ్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ దేశానికి చెందిన లిండా, జాన్ అనే దంపతులు ఉన్నారు. అయితే, జాన్ చేపల వేటకు వెళ్లేవాడు. ఓ రోజున తనను కూడా చేపల వేటకు తీసుకెళ్లాలని భార్య కోరింది. అందుకు ఆయన నిరాకరించారు. దీంతో ఆమెకు కోపం వచ్చింది. వెంటనే తన భర్తను అమ్ముతున్నట్టుగా ఆ దేశంలోని ప్రముఖ సైట్ 'ట్రేడ్‌మీ'లో ప్రకటన ఇచ్చింది. 
 
తన భర్త ప్రొఫైల్‌ను క్రియేట్ చేసి ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చని పేర్కొంది. ఇందులో తన భర్త గుణగణాలను వివరించింది. భర్త చాలా మంచివాడని, అందంగా ఉంటాడని, భర్తకు గృహశిక్షణ మాత్రం అవసరమని పేర్కొంది. ఈ ప్రకటన కింద నో ఎక్చేంజ్ అనే క్యాప్షన్‌ను జోడించింది. 
 
ఈ ప్రకటను జాన్ స్నేహితులు గమనించి అతనికి చెవిలో వేశారు. దీంతో ఆయన షాక్ తిన్నాడు. ఆ వెంటనే ట్రేడ్‌మీ వెబ్‌సైట్ నిర్వాహకులను సంప్రదించి ఆ యాడ్‌ను తొలగించాలని కోరారు. కాగా, భార్య చేసిన పనికి జాన్ మాత్రం ఒక్కసారిగా న్యూజిలాండ్ దేశంలో పాపులర్ అయ్యాడు.