జైపూర్‌లో స్వల్ప భూకంపం : రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదు
రాజస్థాన్ రాష్ట్రంలోని పింక్ సిటీగా గుర్తింపు పొందిన జైపూర్‌లో శుక్రవారం స్వల్ప భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 8.01 గంటలకు జైపూర్‌లో భూకంపం కంపించింది. ఈ ప్రకంపనలు భూకంప లేఖినిపై 3.8గా నమోదైనట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్.ఎస్.సి) వెల్లడించింది.
ఈ భూకంప కేంద్రాన్ని జైపూర్‌కు 92 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియాల్సివుంది.
కాగా, ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధ, గురువారాల్లో భూమి స్వల్పంగా కంపించిన విషయం తెల్సిందే. గురువారం తెల్లవారుజామున కత్రాలో గంటల ప్రాంతంలో 3.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. అలాగే, బుధవారం పహల్గామ్‌లో ఉదయం 5.43 గంటల ప్రాంతంలో 3.2 తీవ్రతతో భూప్రకంపనలు సంభవించాయి.