శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (09:03 IST)

ఇండోనేషియాకు తప్పిన సునామీ ముప్పు

సముద్ర దీవి ప్రాంతమైన ఇండోనేషియాకు మరో సునామీ ముప్పు తప్పింది. బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఈ దీవిలోని కెపులవన్ బరత్ దయాలో ఈ భారీ భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రకంపనలు భూకంప లేఖినిపై 6.4గా నమోదయ్యాయి. 
 
యూరోపియన్ మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ లెక్కల ప్రకారం భూ అంతర్భాగంలో 127 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు సంభవించాయని పేర్కొన్నారు. దీని ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం లేదని వెల్లడించారు. అయితే, అర్థరాత్రి సమయంలో భూకంపం రావడంతో ప్రజలు గృహాల నుంచి ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారని అధికారులు వెల్లడించారు. 
 
భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన ఆస్తి, ప్రాణనష్టం వివరాలు తెలియాల్సివుంది. ఇదిలావుంటే, జనవరి 19వ తేదీన ఇండోనేషియాలో భూకంపం సంభవించిన విషయం తెల్సిందే. అమహైకి సమీపంలోని 5.5 తీవ్రతతో భూమి కంపించింది. దీంతో జావా ద్వీపంలో కూడా భూ కదలికలు సంభవించాయి.