మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 11 డిశెంబరు 2021 (14:44 IST)

విమానాశ్రయం ముందు అభిమానుల కోసమని అన్నీ విప్పేసిన మోడల్

స్టార్లలో రకరకాల స్టార్లు వుంటారు. అభిమానులు ఏది అడిగితే అది చేసేసే స్టార్స్ చాలామంది వుంటారు. హాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది మరీ ఎక్కువ. ఇక మోడళ్లు, పోర్న్ స్టార్ల విషయం అయితే వేరే చెప్పక్కర్లేదు.

 
ఇండోనేసియాకు చెందిన ఓ మోడల్ స్టార్ ఏకంగా విమానాశ్రయం ముందు ఫోటో షూట్ మొదలుపెట్టింది. తన అభిమానులు అడిగారంటూ చకచకా దుస్తులు విప్పేసింది. నగ్నంగా ఫోటో షూట్ చేయడం మొదలుపెట్టింది. దాంతో అక్కడున్న స్థానికులు షాక్ తిన్నారు. వెంటనే సమాచారం పోలీసులకు అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను అరెస్టు చేసారు.

 
ఇండోనేషియా జావా విమానాశ్రయంలో అశ్లీల ఫోటో షూట్ చేసిన సదరు మోడల్ కి 18 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం వుందని అధికారులు తెలిపారు. కానీ ఇలాంటి ఫోటో షూట్లు తను ఇంతకుముందు కూడా చాలా చేసాననీ, తన అభిమానుల్లో సింహభాగం పురుషులేనంటూ ఆ మోడల్ చెప్పడం కొసమెరుపు.