PUC లేకుంటే 6 నెలలు జైలు
దేశ రాజధానిలో కాలుష్యం పెరుగుతుంది. ఈ క్రమంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఢిల్లీ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్ సమయంలో వాహనానికి సంబంధించిన పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలంటూ పబ్లిక్ నోటీస్ జారీ చేసింది.
సర్టిఫికెట్ సమర్పించడంలో విఫలమైతే ఆరు నెలల జైలుశిక్ష, రూ.10వేల జరిమానా.. రెండూ విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. పీయూసీ సర్టిఫికెట్ చూపించని వాహనాల డ్రైవర్ల లైసెన్స్‌ను మూడు నెలల పాటు రద్దు చేస్తామని నోటీస్‌లో పేర్కొంది.
సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989 ప్రకారం.. ప్రతి వాహనానికి (బీఎస్ ఒక నుంచి 4 వరకు అలాగే CNG/LPGతో నడిచే వాహనాలతో సహా) చెల్లుబాటు అయ్యే సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలని స్పష్టం చేసింది.