గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎంజీ
Last Updated : బుధవారం, 6 అక్టోబరు 2021 (08:31 IST)

వాహనాల హారన్‌ సౌండ్లు మార్చే యోచనలో కేంద్రం?

వాహనాల హారన్‌ సౌండ్లు మార్చే యోచనలో కేంద్రం ఉందనే కథనాల నడుమ..  కీలకమైన ప్రకటన చేశారు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ. నాసిక్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ మాట్లాడుతూ.. కార్లకు మాత్రమే హారన్‌ శబ్దాలను, అదీ భారతీయ సంగీత వాయిద్యాల శబ్దాల్ని అన్వయింజేస్తామని, చట్టబద్ధత ద్వారా దీనిని అమలు చేయబోతున్నామని వెల్లడించారు. 
 
హారన్‌ శబ్దాలు మార్చేలా వ్యవస్థను తీసుకురాబోతున్నామని, ఇందుకోసం ప్రత్యేక చట్టం అమలులోకి తేబోతున్నామని ప్రకటించారు రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ. నిజానికి గతంలోనే ఆయన పేరు మీద ‘ప్లీజ్‌ ఛేంజ్‌ హార్న్‌’ కథనం వెలువడినప్పటికీ.. ఇప్పుడు నేరుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

ఫ్లూట్‌, తబలా, వయొలిన్‌, మౌత్‌ ఆర్గాన్‌, హార్మోనియం.. ఈ లిస్ట్‌ పరిశీలనలో ఉన్నట్లు తెలిపారాయన.అంతేకాదు ఆంబులెన్స్‌, పోలీస్‌ వాహనాల సైరన్‌లను మార్చే అంశం పరిశీలిస్తున్నామని, వాటి స్థానంలో ఆల్‌ ఇండియా రేడియోలో వినిపించే ఆహ్లాదకరమైన సంగీతాన్ని చేర్చే విషయమై సమీక్షిస్తున్నట్లు గడ్కరీ వెల్లడించారు.