బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 5 అక్టోబరు 2021 (14:51 IST)

రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడితే, రూ. 5వేలు పారితోషికం

రహదారి ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే స్పందించి ఆదుకునే వారికి రూ.5,000 చొప్పున పారితోషికాన్ని అందించే పథకాన్ని ప్రారంభించినట్లు కేంద్రం తెలిపింది. తొలి గంటలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడేవారికి నగదుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందిస్తారు. ఈ నెల 15 నుంచి పథకం అమల్లోకి వస్తుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాణదాతలుగా నిలిచిన 10 మందికి రూ.లక్ష చొప్పున అందిస్తారు.
 
ప్రమాదం గురించి మొట్టమొదటగా ఎవరైనా పోలీస్‌స్టేషన్‌కు తెలియపరిస్తే వివరాలను వైద్యులతో ధ్రువీకరించుకుని పోలీసులు ఒక రసీదు ఇస్తారు. దాని నకలును జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలోని కమిటీకి పోలీసు స్టేషన్‌ నుంచి పంపిస్తారు. ఎవరైనా తమంతట తాముగా బాధితుల్ని నేరుగా ఆసుపత్రికి తరలిస్తే,  పూర్తి వివరాలను ఆసుపత్రి వారే పోలీసులకు తెలియపరచాలని కేంద్రం మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇలా చేయ‌డం వ‌ల్ల రోడ్డు ప్ర‌మాదాలలో అజాగ్ర‌త్త‌, ఆసుప‌త్రికి త‌ర‌లించ‌డంలో నిర్ల‌క్ష్యం, భ‌యం తొల‌గుతుంద‌నే  కేంద్రం ఈ పారితోషికాల‌ను ప్ర‌క‌టించింది. దీనితో బాధితుల ప్రాణాల‌ను కాపాడేందుకు అవ‌కాశం పెరుగుతుంద‌ని పేర్కొంటున్నారు.