సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , సోమవారం, 4 అక్టోబరు 2021 (15:50 IST)

" మా "ఎన్నికలకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు !!

" మా " ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయ ర‌చ్చ జ‌రుగుతోంద‌నే ఆరోప‌ణ‌ల‌ను కొట్టి ప‌డేస్తూ, ఏపీలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం తాజాగా ఒక ప్ర‌క‌ట‌న చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి గానీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
 
సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అక్టోబ‌రు 10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలకు ప్రభుత్వానికి, జగన్మోహనరెడ్డికి ఏ మాత్రం ఆసక్తి,,  ఉత్సాహం లేదని ఈ మేరకు తెలుగు సినిమా పరిశ్రమ వర్గాలందరికి విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. మా ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలిచినా, అది ఆ సంఘానికి సంబంధించిన వ్య‌వ‌హార‌మ‌ని, ఇందులో ప్ర‌భుత్వానికి గాని, రాజ‌కీయ పార్టీల‌కు గాని జోక్యం ఉండ‌బోద‌న్నారు.