గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 4 అక్టోబరు 2021 (11:52 IST)

నెల్లూరులో "నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా-2021"

నెల్లూరు జిల్లా ఐటిఐ క్యాంపస్ లో "నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా-2021 ఘ‌నంగా నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనేందుకు పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ‌చ్చారు. నెల్లూరు పట్టణంలోని వెంకటేశ్వరపురం ఐ.టీ.ఐ క్యాంపస్(బాలురు)లో  నిర్వహిస్తున్న  "నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా-2021"లో ముఖ్య అతిథిగా హాజరైన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాల‌పై విస్తృతంతా చ‌ర్చిస్తున్నారు. 
 
ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జాయింట్ కలెక్టర్ గణేష్,  ఎంప్లాయ్ మెంట్ ట్రైనింగ్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస మధు, జాయింట్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం ఉన్నతాధికారులు ఈ మేళా ద్వారా యువ‌త‌కు ప‌రిశ్ర‌మ‌ల‌లో మెళ‌కుల‌వ‌లు అందిస్తున్నామ‌ని తెలిపారు. మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళాను ప్రారంభించారు. ఈ అప్రెంటిస్షిప్ మేళాలో ప్రముఖ కంపెనీలు అశోక్ లేల్యాండ్, శ్రీసిటీ, టీవీఎస్, ఆర్టీసీ, రైల్వే, షార్, నెల్ కాస్ట్, ఫార్మా త‌ద‌త‌ర కంపెనీలు పాల్గొంటున్నాయి. అప్రెంటిస్షిప్ మేళాకు హాజరైన వందలాది మంది యువతీ యువకులు ఇక్క‌డ శిక్ష‌ణ పొందుతున్నారు.