శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 30 నవంబరు 2021 (12:18 IST)

210 ఖైదీలను విడుదల చేసిన తాలిబన్ ప్రభుత్వం

ఆప్ఘనిస్థాన్ దేశాన్ని ఆక్రమించుకున్న తాలిబన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జైలులో ఉన్న ఖైదీల్ల 210 మందిని విడుదల చేసింది. నిజానికి ఆప్ఘనిస్థాన్‌లో అధికార మార్పిడి జరిగినప్పటి నుంచి ఆ దేశ ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నారు. 
 
ఈ క్రమంలో తాలిబన్ పాలకలు జైళ్లలో ఉన్న కరుడుగట్టిన ఖైదీలను విడుదల చేయడం చర్చనీయాంశంగా మారింది. అలాగే, తాలిబన్ పాలకులు తీసుకున్న ఈ నిర్ణయం ఇపుడు ఆ ప్రజలను మరింతగా ఆందోళనకు గురిచేసింది. 
 
కాగా, ఆప్ఘనిస్థాన్‌లోని వివిధ జైళ్ళలో కొన్నేళ్లుగా మగ్గుతూ వచ్చిన అనేక మంది ఖైదీల్లో ఇప్పటివరకు ఏకంగా 600 మందిని ఉగ్రవాదులను తాలిబన్ పాలకులు రిలీజ్ చేసినట్టు ఆప్ఘన్ ప్రభుత్వ మీడియా వర్గాలను ఉటంకిస్తూ స్పుత్నిక్ వార్తా సంస్థ వెల్లడించింది. 
 
అలాగే గినియా ప్రభుత్వం పతనం నుంచి ఆప్ఘాన్‌లో అనేక దాడులకు పాల్పడిన ఉగ్రవాదులను నిరోధించడంలో తాలిబన్ తీవ్రవాదులు విఫలమయ్యారని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.