1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (23:16 IST)

బాల‌య్య ఓ అణుబాంబు - రాజ‌మౌళి కితాబు

Rajamouli
శ‌నివారం రాత్రి శిల్పకళా వేదికలో జరిగిన అఖండ ప్రీరిలీజ్ వేడుక‌కు రాజ‌మౌళి హాజ‌ర‌య్యారు. ఆయ‌న ట్రైల‌ర్ చూశాక స్పందించారు. ఇప్ప‌టివ‌ర‌కు వ‌ర‌కు క‌రోనావ‌ల్ల పెద్ద సినిమా జోష్ రాలేదు. ఇప్పుడు బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను క‌ల‌యిక‌తో  అభిమానులకు  మొత్తం చిత్ర పరిశ్రమలో భారీ జోష్‌ను తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా. డిసెంబర్ 2న విడుదల కానున్న అఖండ చిత్రంతో సినీ ప్రేమికులు, పరిశ్రమలు కిటకిటలాడాలని రాజమౌళి ఆకాంక్షించారు.
 
“బాలయ్య ఓ అణుబాంబు. సరిగ్గా బాంబ్ ఎలా ప్రయోగించాలో బోయపాటి శ్రీను గారికి మాత్రమే తెలుసు. ఆ రహస్యాన్ని తన దగ్గర ఉంచుకోకుండా అందరితో పంచుకోవాలి’’ అని రాజమౌళి అన్నారు.  బాలయ్య ఎనర్జీ డ్యాన్స్‌లపై రాజ‌మౌళి ప్రశంసలు కురిపించారు. “మేము ప్రోమోలలో చూసినది కేవలం మ‌చ్చుతున‌క‌. అస‌లు ఇంకా చాలా వుంది. మీ అందరిలాగే నేనూ అఖండ సినిమా కోసం ఎదురుచూస్తున్నా. థియేట‌ర్‌లోనే చూస్తాను. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోని థియేటర్‌లో తప్పకుండా చూస్తాను” అని రాజమౌళి తెలిపారు.
 
ఇంకా ఆయ‌న మాట్లాడుతూ, చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి, సంగీత స్వరకర్త తమన్‌ను అభినందించారు.మొత్తం టీమ్‌కు గ్రాండ్ సక్సెస్ కావాలని ఆకాంక్షించారు. అఖండలో హీరో శ్రీకాంత్, జగపతి బాబు, ప్రగ్యా జైస్వాల్, పూర్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.