సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 నవంబరు 2021 (16:30 IST)

జనని వీడియో సాంగ్.. (Video)

RRR
జక్కన్న రాజమౌళి తెరకేక్కిస్తున్న సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్‌'. పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలే నెలకొన్నాయి. మొన్న విడుదలైన నాటు నాటు సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో.. యూట్యూబ్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జనని సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. 
 
"సోల్ అంతెం ఆఫ్ RRR"గా విడుదలైన ఈ పాటలో చరణ్ ఎరుపు రంగు మిలట్రీ డ్రెస్‌తో ఎంట్రీ ఇచ్చాడు. తరువాత గాయాలతో ఎన్టీఆర్ కనపడటం తరువాత బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ గన్ పట్టుకొని.. పక్కన హీరోయిన్ శ్రియ "మరి మీరు అని అడగటం".. "సరోజినీ నేను అంటేనే నా పోరాటం అందులో నువ్ సగం" అని చెప్పిన అజయ్ దేవగన్.. బాలీవుడ్ నటి  అలియా భట్ మట్టి చేతులతో తీసుకొని.. రామ్ చరణ్‌కి తిలకం దిద్దటం.. ఇలా ఆద్యంతం భావోద్వేగాలతో సాగింది.