మంగళవారం, 1 జులై 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 30 జూన్ 2025 (23:37 IST)

జస్ట్ మిస్, ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న 737 బోయింగ్ విమానం (video)

737 Boeing Plane Narrowly Escapes a Fatal Accident
ఘోర ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నది బోయింగ్ 737 విమానం. ఇండోనేసియాలోని శేకర్నో-హట్టా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం స్కిడ్ అయ్యింది. దీనితో విమానం కుడి రెక్క రన్ వేను తాకుతున్నట్లు పక్కకి ఒరిగిపోయింది. ఐతే అదృష్టవశాత్తూ పైలట్ విమానాన్ని తన ఆధీనంలోకి తీసుకుని సేఫ్ ల్యాండ్ చేసాడు. దీనితో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
 
కాగా విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రన్ వే పైన పూర్తిగా నీరు వున్నది. గాలివాన బీభత్సం సృష్టించి వాతావరణం కాస్త ప్రతికూలంగా మారింది. ఆ తరుణంలో విమానం ల్యాండ్ అయ్యింది. మొత్తమ్మీద పైలెట్ సమయస్ఫూర్తిగా విమానం సేఫ్ గా ల్యాండ్ అయ్యింది. తదుపరి విమానాన్ని తనిఖీ చేయగా ఎలాంటి డ్యామేజ్ జరిగినట్లు కనిపించలేదు. దీనితో తిరిగి అదే విమానం ప్రయాణం సాగించింది.