గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : గురువారం, 25 నవంబరు 2021 (16:48 IST)

జ‌న‌నీ పాటతో ఫీల్ కలగలేదు కానీ సస్పెన్స్ క్రియేట్ అయ్యింది, రాజమౌళి లాజిక్ ఏంటో?

Rajamouli
ద‌ర్శ‌కుడు రాజమౌళి తెర‌కెక్కించిన `ఆర్‌.ఆర్‌.ఆర్‌.` సినిమాలో `జ‌న‌నీ.. ` అనే సాంగ్‌ను ఈనెల 26న శుక్ర‌వారంనాడు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ముందుగానే ప్ర‌క‌టించాడు. ఆ గీతం రుచి ఎలా వుంటుందో ప్ర‌త్యేకంగా మీడియాకు గురువారంనాడు హైద‌రాబాద్‌లోని సినీమేక్స్‌లో ప్ర‌ద‌ర్శించారు. ఆ గీతం అనేది ముందుగా అనుకోలేద‌నీ, రీరికార్డింగ్‌లో వుండ‌గా ఇక్క‌డ ఇలా బాగుంటుంద‌ని కీర‌వాణి అన‌డంతో నేను ఫీల‌యి చేసిన గీత‌మే ఇది. చూసి ఆనందించండి అంటూ రాజ‌మౌళి తెలిపారు. మ‌రి అదెలా వుందో చూద్దాం.
 
ఓపెన్ చేయ‌గానే  కాల్పుల మోత‌, ప్రాణ‌ర‌క్ష‌ణ‌తో ప‌రుగెత్తే ప్ర‌జ‌లు. అప్పుడు బ్యాక్‌డ్రాప్‌లో.. జ‌న‌నీ అనే పాట వ‌స్తుంది. కొమ‌రం భీమ్‌, అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లు పోషిస్తున్న ఎన్‌.టి.ఆర్‌., రామ్‌చ‌ర‌ణ్ క‌నిపిస్తారు. ఎన్‌.టి.ఆర్‌. ఓ సీన్‌లో చాలా బాధ‌తో లోప‌ల‌ నుంచి త‌న్నుకొస్తున్న ఫీల్‌తో కనిపిస్తాడు. రామ్‌చ‌ర‌ణ్‌.. బ్రిటీష్ సైనికుల డ్రెస్‌లో ఓసారి మ‌రో షాట్‌లో  పోరాటం చేసే పాత్ర‌లో క‌నిపిస్తాడు. ఇది చూసేవారికి ఆస‌క్తి క‌లిగిస్తుంది. ఇంత‌కీ రామ్‌చ‌ర‌ణ్ పాత్ర ఏమిటి? అనేది. స‌స్పెన్స్‌గా వుంది.
 
ఇక పాట కొన‌సాగింపు....
- జ‌న‌నీ.. వీర భార‌త జ‌న‌ని.. అని వ‌స్తుండ‌గా, మ‌రి మీరు.. అంటూ.. పోరాటయోధుడైన అజ‌య్‌దేవ‌గ‌న్‌ను అత‌ని భార్య అడుగుతుంది.
 
స‌రోజ‌ని.. నేనంటే నా పోరాటం. అందులో స‌గం.. అంటూ అజ‌య్ సస‌మాధాన‌మిస్తాడు. ఆమె కంటి నుంచి నీటి చుక్క రాలుతుంది.
 
- మీ పాద ధూలి తిల‌కంతో నీ విశ్వ‌చ‌రితం. నా స్వ‌ప్న భార‌త‌వ‌ని.. జ‌న‌నీ.. అంటూ గీతం ఓ అనుభూతితో సాగుతుండ‌గా.. వెంట‌నే ఓ తండ్రికి బ్రిటీష్ పోలీసు తూటా తాక‌డం. అత‌ని చేతిలోంచి ఓ బిడ్డ ప‌డిపోవ‌డం. ఆ బిడ్డ‌ను.. మ‌రో వ్య‌క్తి ప‌డిపోకుండా ప‌ట్టుకోవ‌డం..  జ‌న‌నీ... నీవే... అంటూ పాట ఆ షాట్‌లో రావ‌డం జ‌రుగుతుంది.
ఈ గీతంలోని షాట్ ఆమె కోస‌మే అన్న‌ట్లు వుండ‌డం. ఆ పిల్ల ఎవ‌ర‌నేది? స‌స్పెన్స్‌తో వ‌దిలేశాడు. ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. మ‌ధ్య‌లో కీర‌వాణి వాయిస్‌తో ఓ ప‌ల్ల‌వి సాగుతుంది.
 
- ఇలా ఓ ఫీల్‌తో సాగిన జ‌న‌ని సాంగ్‌.. రాజ‌మౌళికి నేప‌థ్యం తెలుసు కాబ‌ట్టి ఆయ‌న ఫీల్‌తో మాట్లాడాడు. కానీ చూసే ప్రేక్ష‌కుడికి నేప‌థ్యం తెలీదు క‌నుక పెద్ద‌గా ఫీల్ రాలేద‌నేది టాక్‌. సినిమా చూస్తే కానీ అస‌లు ఏమిటో అర్థంకాదు. ఇలా స‌స్పెన్స్‌ను రాజ‌మౌళి క్రియేట్‌ చేశాడ‌న్న‌మాట‌.