గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (09:00 IST)

రాజ‌మౌళి విడుద‌లచేసిన కొత్త పోస్ట‌ర్ - 26న జ‌న‌ని పాట వ‌చ్చేస్తుంది

RRR poster new
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం గురించి ప్ర‌మోష‌న్ కోసం రాజ‌మౌలి తెగ క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. ఇటీవ‌లే ముంబై వెళ్ళి స‌ల్మాన్‌ఖాన్‌ను క‌లిసి ప్ర‌మోష‌న్ కోసం ఆహ్వానించాడు. ఇప్పుడు ఈ సినిమాలోని కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. అందులో అజ‌య్‌దేవ్‌గ‌న్‌, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్‌.టి.ఆర్‌. ఫేస్‌లు వున్నాయి. అందులో `జ‌న‌ని` అనే గీతాన్ని ఈనెల 26న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. 
 
దీని గురించి రాజ‌మౌళి ట్వీట్ చేస్తూ, ‘పెద్దన్న కీరవాణి ఆత్మీయ స్వరకల్పన ‘జనని..’. భావోద్వేగాలతో నిండిన శక్తిమంతమైన గీతమిది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సోల్‌ ఆంథమ్‌’’ అని పేర్కొన్నాడు.. విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల జీవితాల ఆధారంగా అల్లుకున్న ఫిక్షనల్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఈ చిత్రం.. సంక్రాంతి సందర్భంగా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్రా, ఛాయాగ్రహణం: సెంథిల్‌ కుమార్‌.