గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 17 నవంబరు 2021 (17:31 IST)

రామ్ చ‌ర‌ణ్‌, ఎన్‌.టి.ఆర్‌.తో ప్రేమ్ ర‌క్షిత్ స్టెప్‌లు ఇలా వేయించారు

Prem rakshit- Natu step
ఇటీవ‌లే `ఆర్‌.ఆర్‌.ఆర్‌.` నుంచి నాటు నాటు.. అంటూ విడుద‌లైన పాట‌కు అనుగుణంగా వేసిన‌ స్టెప్‌కు మంచి ఆద‌ర‌ణ వ‌చ్చేసింది. దీని కొరియోగ్రాఫ‌ర్ ప్రేమ్ ర‌క్షిత్‌. ఇద్ద‌రు హీరోల‌తో ఎలా స్టెప్‌లు వేయించాడో అనేది త‌న శిష్యుల‌తో చేయిస్తూ ఓ వీడియోను బ‌య‌ట‌కు విడుద‌ల చేశాడు. మొద‌ట్లో నాటు..నాటు. అంటూ. అన్న ప‌దానికి అనుగుణంగా ఒక కాలితో ఎలా స్టెప్ వేయాల‌నేది చిత్రించామ‌ని తెలియ‌జేశాడు. ఇలా చేసి చూపిస్తుంటే చ‌ర‌ణ్‌, ఎన్‌.టి.ఆర్‌. ఎదురుచూగా చూస్తూ ఫాలో అయ్యార‌నీ, ఒక్కసారి చూడ‌గానే ఇద్ద‌రూ బాగా స్టెప్‌లేశార‌ని తెలిపారు.
 
నాటు..నాటు.. అనేపాట మాస్ ఏంథ‌మ్‌గా మంచి ఫాలోయింగ్‌ను చేజిక్కించుకుంది. ఇది కొన్నాళ్ళ‌పాటు మాస్‌లో క్రేజ్ తెచ్చుకుటుంద‌ని ప్రేమ్ ర‌క్షిత్ తెలియ‌జేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రౌద్రం రణం రుధిరం. డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. పీరియాడిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్నారు.