ఆర్ఆర్ఆర్ సోల్ ఆంథమ్... జనని సాంగ్ రిలీజ్ ప్రెస్ మీట్
ఆర్ఆర్ఆర్ నుంచి సాంగ్ వచ్చేస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆర్‌ఆర్‌ఆర్ సోల్ ఆంథమ్‌ను విడుదల చేయనున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా భారీ బడ్జెట్‌గా తెరకెక్కింది. అందులో బాలీవుడ్, హాలీవుడ్ ఫేమస్ యాక్టర్స్ నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
ఇక ఇటీవల విడుదలైన నాటు నాటు వీర నాటు సాంగ్ నెట్టింట్లో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని జనవరి 7న ప్రేక్షకుల ముందుకు తీసుకుపోతుంది.
ఈ నేపథ్యంలో ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ ప్రమోషన్స్ ప్రారంభించింది. ఇందులో భాగంగా జనని అనే పాట విడుదల చేయనుంది. దేశభక్తిని చాటే విధంగా రూపొందించిన ఈ పాటను ప్రెస్‌మీట్‌లో విడుదల చేశారు.
పాట విడుదల కార్యక్రమంలో రాజమౌళి, నిర్మాత దానయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. జనని పాట ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకి ఓ సోల్. ఈ పాట కోసం కీరవాణి అన్నయ్య రెండు నెలలు శ్రమించారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్ కూడా రాశారు.
డిసెంబర్ మొదటి వారంలో ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ విడుదల చేస్తాం. సినిమా ప్రమోషన్స్ భారీగానే ప్లాన్ చేశాం. వచ్చే నెలలో వరుసగా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ఏర్పాట్లు చేస్తున్నాం. నటీనటులు, మెయిన్ టెక్నిషియన్స్.. ఇలా ఆర్‌ఆర్‌ఆర్ టీమ్ మొత్తం త్వరలోనే మీ ముందుకు వస్తాం. మీ ప్రశ్నలన్నింటికీ మేము సమాధానం చెబుతామని తెలిపారు.