సోమవారం, 30 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (23:03 IST)

బాల‌య్య‌బాబు చేయి విర‌గ‌డానికి కార‌ణం నేనే!

Boyapati- Balakrishna
నంద‌మూరి బాల‌కృష్ణ ఎడ‌మ‌చేయికి పాక్చ‌ర్ అయిన విష‌యం తెలిసిందే. ఆయ‌న ఆహాలో ఇన్‌స్టాబుల్ ప్రోగ్రామ్ షూట్ చేస్తుండ‌గా గుర్రంపైనుంచి ప‌డిపోయాడ‌ని ఇటీవ‌లే వార్త‌లు వ‌చ్చాయి. కానీ అదికాదని ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను మాట‌ల్లో తెలుస్తోంది. అఖండ ప్రీరిలీజ్ వేడుక‌లో బాల‌య్య‌బాబు గురించి మాట్లాడుతూ, బాల‌కృష్ణ‌గారికి చేయి విర‌గ‌డం వెనుక త‌న హ‌స్తం వుంద‌ని వెల్ల‌డించారు. జై బాల‌య్య‌.. అనే సాంగ్‌ను ఆయ‌న చేశారు. దాదాపు రెండు గంట‌ల‌పైగా ఆయ‌న డాన్స్ చేశారు. స‌హ‌జంగా ఎవ‌రైనా అల‌సిపోతారు. దాన్నుంచి ఫిట్ కావాలంటే నెక్ట్ రోజు ఎక్స‌ర్ సైజ్ చేయాలి. అప్పుడే బాడీ సెట్ అవుతుంది. 
 
అలా ఆయ‌న మ‌రుస‌టి వ‌ర్క‌వుట్ చేస్తుండ‌గా కాలుస్లిప్ అవ‌డంతో ఒక్క‌సారిగా ఎడ‌మ మోచేతిని కింద బేల‌న్స్ కోసం పెట్టారు. దాంతో విప‌రీత‌మైన దెబ్బ‌తగిలింది. పాక్చ‌ర్ అయింది. ఆ త‌ర్వాత ఆయ‌న దాన్ని చాలా తేలిగ్గా తీసుకున్నారు. ఈ విష‌యం మ‌రుస‌టి రోజు సెట్‌లోకి వ‌చ్చేవ‌రికి నాకు తెలియ‌లేదు. విష‌యం తెలుసుకుని షూటింగ్ వ‌ద్ద‌న్నాను. కానీ నో.. చేసేద్దాం. అభిమానుల‌కోసం ఎంత‌టి క‌ష్ట‌మైనా భ‌రించాలి. షూటింగ్ ఆగితే ఎంతో న‌ష్టం క‌లుగుతుంద‌ని మొండిగా ఆయ‌న ఆ షూట్‌ను పూర్తిచేశార‌ని ప్ర‌శంసించారు.