జమ్మూకాశ్మీర్ కత్రాలో స్వల్ప భూకంపం
జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని కత్రాలో గురువారం తెల్లవారుజామున స్వల్పంగా భూమి కంపించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 3.5గా నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది. ఈ భూప్రకంపనలు గురువారం తెల్లవారుజామున 3.02 గంటల సమయంలో కనిపించాయని పేర్కొంది.
కత్రాకు 84 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రంగా గుర్తించినట్టు ఎస్.సి.ఎస్ తెలిపింది. అయితే, భూ ప్రకంపనల వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియలేదు.
ఇదిలావుంటే, పహల్గామ్‌లో బుధవారం ఉదయం 5.43 గంటల సమయంలో భూమి కంపించిన విషయం తెల్సిందే. దీని తీవ్రత 3.2గా నమోదైందని ఎన్.సి.ఎస్ వెల్లడించింది. పహల్గామ్‌కు 15 కిమీ దూరంలో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ నెల 5వ తేదీ కూడా జమ్మూ డివిజన్‌లో 5.9 తీవ్రతతో ఓ భూకంపం సంభవించిన విషయం తెల్సిందే.