1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (13:17 IST)

మరో దాణా కుంభకోణంలో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ యాదవ్

బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోమారు దోషిగా తేలారు. మరో గడ్డి స్కామ్‌లో ఆయన దోషిగా నిలిచారు. ఈ మేరకు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయన్ను దోషిగా తేల్చుతూ న్యాయమూర్తి సీకే షైని ఆదేశాలు జారీచేశారు. 
 
డొరండా ట్రెజరీ నుంచి రూ.139 కోట్ల అక్రమంగా తీసుకున్న కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆ సమయంలో ఆయన కోర్టు బోనులోనే ఉన్నారు. అయితే, శిక్షను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ఒకవేళ ఈ కేసులో మూడేళ్లకు మించి శిక్ష పడితే మాత్రం ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సివుంటుంది. 
 
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశువులకు ఉచిత దాణా పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద నిధులను ఇష్టానుసారంగా లాలూ ప్రభుత్వం విత్ డ్రా చేసి స్వాహా చేసింది. ఈ గడ్డి స్కాములో పలు కేసులు నమోదు కాగా, ఒక్కో కేసులో తీర్పును వెలువడుతూ వస్తుంది. తాజాగా ఐదో కేసులో తీర్పు వెలువడింది. కాగా, గత 2017 డిసెంబరు నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ జైలు జీవితం గడుపుతున్న విషయం తెల్సిందే.