ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (15:46 IST)

కడప జైలర్ వరుణా రెడ్డిపై బదిలీ వేటు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు, జైళ్ళ శాఖల్లో కీలక బదిలీలకు తెరలేచింది. ఇప్పటికే రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్‌ను బదిలీ చేసిన ఏపీ సర్కారు ఇపుడు కడప జిల్లా జైలర్ వరుణా రెడ్డిని కూడా బదిలీ చేసింది. ఈయనను ఒంగోలు జైలుకు బదిలీ చేసింది. ఒంగోలు జైలర్ ప్రకాశ్‌ను కడప జైలుకు మార్పు చేసింది. 
 
ఇటీవల వరుణా రెడ్డిపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దు శీను జైలులో హత్యకు గురైన సమయంలో కడప జైలర్‌గా వరుణా రెడ్డి ఉన్నారు. ఇపుడు కడప జిల్లా జైల్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులోని నిందితులు ఉన్నారు. 
 
దీంతో ఈ నిందితులను హతమార్చేందుకు కుట్ర చేస్తున్నారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. పైగా, వరుణారెడ్డి కడప జైలర్‌గా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తుందని చంద్రబాబు సందేహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వరుణా రెడ్డిని బదిలీ చేయడం గమనార్హం.