సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఏపీ సీఎంవో నుంచి ప్రవీణ్ ప్రకాష్ ఔట్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో సర్వాధికారిగా పెత్తనం చెలాయిస్తూ వచ్చిన సీనియర్ ఐఏఎస్ అధికారి, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్‌కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్వాసన పలికారు. ఆయన్ను ఆకస్మికంగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనరుగా బాధ్యతలు అప్పగించింది. ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన్ను రాష్ట్ర  నుంచి బయటకు గంటేశారని చెప్పొచ్చు. 
 
గత కొంతకాలంగా ప్రవీణ్ ప్రకాష్‌పై సీఎం గుర్రుగా ఉంటున్నారు. పైగా, సీఎంవో ఆయన ప్రాధాన్యతను క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. ఆయన బాధ్యతలను మరో ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డికి అప్పగించారు. ఈ క్రమంలో తాజా ప్రవీణ్ ప్రకాష్‌పై బదిలీపేరుతో సీఎంవోలో లేకుండా చేశారు. 
 
ఇటు సీఎంవో, ఓటు జేఏడీ పొటికిలక్ సెక్రటరీగా ప్రభుత్వంలోని అతి కీలకమైన అధికారాలన్నీ తన గుప్పెట పెట్టుకున్న ప్రవీణ్ ప్రకాష్... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సైతం డమ్మీ చేశారన్న అభిప్రాయం చాలా మంది ఐఏఎస్ అధికారుల్లో నెలకొంది. 
 
ముఖ్యంగా, సీఎంగా నీలం సాహ్ని ఉన్న సమయంలో ఇది కనిపించింది. పైగా, ప్రవీణ్ ప్రకాష్ తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చిపెట్టాయి. దీంతో సీఎం జగన్ ఆయన్ను పక్కనపెట్టేశారు. ఇపుడు ఏకంగా రాష్ట్రం నుంచి పంపించి వేశారు.