గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (17:37 IST)

ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా భావనా సక్సేనా

ఢిల్లీలోని ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా భావనా సక్సేనా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం భావనా సక్సేనాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
 
ప్రస్తుతం ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా భావనా సక్సేనా కొనసాగుతుండగా అభయ్ త్రిపాఠీ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు.

ఈ నెల 31న అభయ్‌ త్రిపాఠీ ఉద్యోగ విరమణ చేయనున్న నేపథ్యంలో సక్సేనాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.