మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , మంగళవారం, 28 డిశెంబరు 2021 (15:21 IST)

వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డిపై సిబిఐ థ‌ర్డ్ డిగ్రీ? నిజ‌మేనా??

వైయస్ వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డిని సీబీఐ బెదిరిస్తున్న‌ట్లు పులివెందుల కోర్టులో ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాది ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇపుడు పులివెందుల కోర్టులో న‌డుస్తోంది. 

 
వైయస్ వివేకా మాజీ పీఏ కృష్ణారెడ్డిని సీబీఐ అధికారులు  ప్రెజర్ చేసి కొందరి పేర్లు చెప్పాలని 
బెదిరించారని పులివెందుల కోర్టులో కృష్ణారెడ్డి తరపు అడ్వకేట్ ఫిర్యాదు చేశారు. సిబిఐ అధికారులు తనను అనేకమార్లు పులివెందులలో ఢిల్లీకి పిలిచి విచారణ చేసి  తనను ఇబ్బందులకు గురి చేశారని కృష్ణారెడ్డి పేర్కొంటున్నారు. కొందరు వ్యక్తుల పేర్లు చెప్పాలని  తనను ప్రెజర్ చేశారని, తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగం చేశారని కోర్టులో కృష్ణారెడ్డి తరపు లాయర్ ఫిర్యాదు చేశారు. 
 
 
సీబీఐ అధికారులు తనను వేధిస్తున్నారని పులివెందుల పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఈ రోజు కోర్టులో ఫిర్యాదు చేశామని లాయర్ లోకేశ్వర్ రెడ్డి తెలిపారు.