ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

బాలకృష్ణ ఇంటి ముట్టడికి వైకాపా నేతల యత్నం.. ఉద్రిక్తత

అనంతపురం జిల్లా హిందూపురంలో సినీ నటుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన ఇంటిని ముట్టడించేందుకు వైకాపా కార్యకర్తలు, నేతలు ప్రయత్నించారు. హిందూపురం అభివృద్ధిపై బాలకృష్ణ ఇంటి వద్దే బహింగ చర్చకు సిద్ధమని వైకాపా నేతలు బహిరంగ ప్రకటన చేశారు. 
 
రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం హిందూపురం అభివృద్ధికి చేసింది శూన్యమంటూ టీడీపీ నేతలు, శ్రేణులు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా, హిందూపురంలో వైకాపా పాలనలో జరిగిన అభివృద్ధిపై సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి ఎదుటే తాము బహిరంగ చర్చకు సిద్ధమని వైకాపా నేతలు ప్రకటించారు. 
 
ఇందుకోసం వారు బాలయ్య ఇంటికి క్యూకట్టి, ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిజానికి హిందూపురం అభివృద్ధిపై రెండు పార్టీల మధ్య గత కొంతకాలంకా మాటల యుద్ధం కొనసాగుతోంది. రెండు వర్గాల వారు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడమే ఈ ఉద్రిక్తతకు కారణంగా మారింది.