సంబంధిత వార్తలు
- టీడీపీ నేతల బూతులకు ఇది రియాక్షన్ : వైకాపా నేతల దాడులపై సీఎం జగన్
- మా దేవుడు జగన్ పై పిచ్చి వ్యాఖ్యలు చేస్తే, నాలుకలు చీరేస్తాం...
- సీఎం గారూ... మీరే శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే?
- ఇంట్లో దాక్కొని నీ కుక్కలతో దాడి చేయిస్తావు.. నువ్వే రా తేల్చుకుందాం : నారా లోకేష్
- గుణదల అరాచకాలకు ఎలా ముగింపు పలకాలో నాకు తెలుసు
తిట్లు విని భరించలేని అభిమానులు స్పందిస్తున్నారు: సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్‌లోని తెదేపా కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి స్పందించారు. వైకాపా సర్కారుపై ప్రజల ప్రేమను విపక్షం జీర్ణించుకోలేకపోతోందని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నవారు దారుణమైన, పరుష పదజాలం వాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు. తిట్లు విని భరించలేని అభిమానులు స్పందిస్తున్నారు. కావాలని తిట్టించి వైషమ్యాలు రెచ్చగొడుతున్నారు. వైషమ్యాలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలనుకుంటున్నారు. విపక్షం కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతోంది అని జగన్ ఆరోపించారు.
ఇటీవల జరిగిన ప్రతి ఎన్నికలలో ప్రతిపక్షానికి స్థానమే లేకుండా ప్రజలు మాకు ఓట్లు వేసి గెలిపిస్తున్నారు. ఇంత ప్రేమ, ఆప్యాయతలు చూపిస్తుంటే, జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు ఇలా దుర్భాషలాడుతున్నాయని సీఎం చెప్పారు.
