శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 20 అక్టోబరు 2021 (10:11 IST)

గుణదల అరాచకాలకు ఎలా ముగింపు పలకాలో నాకు తెలుసు

గంజాయిపైనా, సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పైనా వ్యాఖ్య‌ల చేసిన టీడీపీ నాయ‌కుడు ప‌ట్టాభి ఇంటిపై వైసీపీ వ‌ర్గాలు దాడిని మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా ఖండించారు. విజయవాడలో ప‌ట్టాభి ఇంటికి రాధా స్వ‌యంగా వెళ్ళి ఆయ‌న్ని ప‌రామ‌ర్శించారు. పట్టాభి కుటుంబ సభ్యులను పరామర్శించిన వంగవీటి రాధ వారి ఇంటిపై జ‌రిగిన దాడిపై పట్టాభి కుటుంబసభ్యులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. 
 
నాయ‌కుల ఇళ్లపై దాడి చేయడంపై వంగ‌వీటి రాధా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లపైకి వచ్చి మహిళలపై దాడి చేసి, చిన్న పిల్లలను భయబ్రాంతులకు గురిచేయడం నీచమైన చర్యగా అభివ‌ర్ణించారు. గుణదల నీచ రాజకీయాలు  తిరిగి పురుడు పోసుకుంటున్నాయి అనేందుకు ఇదే నిదర్శనం అని రాధా వ్యాఖ్యానించారు.

ఇళ్లల్లో ఉన్న మహిళలపై దాడి చేసేంత హేయమైన చర్యలకు ముగింపు ఏంటో చూపిస్తాన‌ని వంగ‌వీటి రాధా తీవ్రంగా హెచ్చ‌రించారు. గుణదల అరాచకాలకు ఎలా ముగింపు పలకాలో నాకు తెలుసు అని రాధా తీవ్ర స్వ‌యంతో అన్నారు. దీనితో అటు టీడీపీ, ఇటు వైసీపీ వ‌ర్గాల మ‌ధ్య ఇపుడు ప‌చ్చ గ‌డ్డి వేస్తే, భ‌గ్గుమ‌నే ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.