శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (13:53 IST)

యాదాద్రిలో బాలయ్య : సీఎం కేసీఆర్‌పై వరాల జల్లు

అఖండ గెలుపుతో నందమూరి హీరో బాలకృష్ణ ఫుల్ స్వింగ్‌లో వున్నారు. తాజాగా ఆయన "అఖండ" టీంతో కలిసి తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిని దర్శించారు. అంతేకాదు ఆయన యాదాద్రి విషయమై సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
 
ఈ సందర్భంగా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన బాలకృష్ణ మాట్లాడుతూ.. "సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం అద్భుతంగా ఉంది. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతమైన దేవాలయం యాదాద్రి. ఇక్కడ పరిసరాలను కలుషితం చేయకుండా చేయాలి. 
 
అఖండ సినిమా సక్సెస్‌లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నాం. అందులో భాగంగానే యాదాద్రి దర్శనానికి వచ్చాము. యాదాద్రి ఒక అద్భుతం హిందూ ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరికి ఉంది.." అంటూ ముఖ్యమంత్రిని ప్రశంసించారు. 
 
కాగా అఖండ టీమ్ ఇటీవల తిరుపతి, విజయవాడ వెళ్ళిన బాలయ్య సోమవారం యాదాద్రి నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్యకు దేవస్థానం అధికారులు వేదాశీర్వచనం అందజేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. బాలయ్య వెంట దర్శకుడు బోయపాటి శ్రీను, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వరెడ్డి తదితరులు ఉన్నారు.