గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 డిశెంబరు 2021 (15:44 IST)

ఏపీలో 15 థియేటర్లు సీజ్.. ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా దెబ్బ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే కొత్త సినిమాలు థియేటర్లలో విడుదలవుతున్నాయి. బాలయ్య అఖండ, అల్లు అర్జున్ పుష్ప రూపంలో రెండు పెద్ద సినిమాలు విడుదలయ్యాయి. వీటిని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. అదే సమయంలో అధికారులు, పోలీసులు కూడా థియేటర్లకు చేరుకుంటున్నారు. 
 
థియేటర్లలో టికెట్లు, క్యాంటీన్, సౌకర్యాలు వంటి వాటిపై ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఇందులో ఎక్కడ ఏ తేడా కనిపించినా విరుచుకుపడుతున్నారు.
 
రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల థియేటర్లపై తనిఖీలు చేపట్టిన అధికారులు, పోలీసులు.. నిబంధనలు ఉల్లంఘించారని తేలితే మాత్రం సీజ్‌లు చేసేస్తున్నారు. ఒక్క కృష్ణాజిల్లాలోనే తనిఖీలు నిర్వహించి 15 థియేటర్లు సీజ్ చేసినట్లు జేసీ మాధవీలత కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. 
 
ఇందులో లైసెన్స్ లు లేకపోవడం, ఆన్ లైన్ టికెట్లు అమ్మకపోవడం, ఇతరత్రా ఉల్లంఘనల్ని అధికారులు కారణంగా చూపుతున్నారు. ముఖ్యంగా ప్రేక్షకులు చేస్తున్న ఫిర్యాదుల్ని సీరియస్ గా తీసుకుని థియేటర్ల సీజ్ చేపడుతున్నట్లు తెలుస్తోంది.