గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 డిశెంబరు 2021 (13:29 IST)

ఏపీలో ఒమిక్రాన్ రెండో కేసు: కెన్యా నుంచి తిరుపతికి వస్తూ

ఏపీలో మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. దీంతో ఏపీలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెండుకు చేరింది. కెన్యా నుంచి చెన్నై మీదుగా తిరుపతికి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. 
 
సదరు మహిళకు ఒమిక్రాన్ సోకినట్లు ఇవాళ నిర్ణారణ అయ్యింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. వారందరికీ నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు.
 
ఈనెల 10వ తేదీన కెన్యా నుంచి మహిళ చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అక్కడ్నుంచి కారులో తిరుపతికి వచ్చింది. 12వ తేదీన తిరుపతిలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడంతో ఆమెకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. 
 
దీంతో ఆమె శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం హైదరాబాద్ తరలించారు. అయితే ఇవాళ వచ్చిన రిపోర్టుల్లో ఆమెకు ఒమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. అలాగే తెలంగాణలో 24 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి