బాలయ్యకు పెరుగుతున్న క్రేజ్: బిగ్ బాస్ హోస్ట్‌గా పగ్గాలు?!
బిగ్ బాస్ ఐదో సీజన్ ముగిసిన తరుణంలో బిగ్ బాస్ ఆరో సీజన్ హోస్ట్ గురించి అప్పుడే చర్చ మొదలైంది. బిగ్ బాస్ హోస్ట్ నుంచి అక్కినేని నాగార్జున తప్పుకున్నారని తెలుస్తోంది. ఇంతకీ సీజన్ 6 హోస్ట్ ఎవరనే దానిపై చర్చ సాగుతోంది.
నటసింహం నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం బాలయ్య ఆహాలో `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` షోకు హోస్ట్‌గా అదరగొట్టేస్తున్న విషయం తెలిసిందే. ఈ షో ద్వారా ఆహాకు భారీగా సబ్‌స్క్రైబర్లు వచ్చిపడుతున్నారు. ఈ పలుకుబడితో బిగ్ బాస్ హోస్ట్ బాధ్యతలు కూడా ఆయనకు అప్పగిస్తే బాగుంటుందని నిర్వాహకులు ప్లాన్ వేస్తున్నారు.
అలాగే బయట ఏదైనా వేదికలెక్కినా.. ఇంకెక్కడైనా బాలయ్య మాట్లాడ్డానికి ఎంత తడబడతాడో తెలిసిందే. కానీ `అన్ స్టాపబుల్` షోలో మాత్రం తడబాటే లేకుండా ఎంతో కూల్‌గా మాట్లాడుతూ సరదాగా హోస్ట్ చేస్తున్నారాయన.
ఈ నేపథ్యంలోనే బిగ్‌బాస్ నిర్వాహకులు సీజన్ 6కు బాలయ్యను హోస్ట్‌గా దింపాలని ప్రయత్నిస్తున్నారట. బాలయ్య బిగ్‌బాస్ షోకి హోస్ట్ చేస్తే.. టీఆర్పీ భారీగా కూడా పెరుగుతుంది. అందుకే ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారట.