మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (15:04 IST)

ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : సుజనా చౌదరి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ప్రతిపక్ష పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులు మంచిదికాదన్నారు. ప్రశ్నించినవారిపై దాడులు ఫ్యాక్షనిస్టు భావజాలానికి నిదర్శనమన్నారు. దాడులకు పాల్పడినవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 
 
ప్ర‌తిప‌క్ష నేత‌ల ఇళ్ల‌పై దాడులకు తెగ‌బ‌డిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. మ‌ళ్లీ ఇటువంటి దాడులు జ‌ర‌గ‌కుండా చూడాల‌ని ఆయ‌న అన్నారు. 
 
టీడీపీ నేత‌ల ఇళ్ల‌పై దాడుల‌ను సీపీఐ నేత రామ‌కృష్ణ కూడా ఖండించారు. రెండేళ్లుగా పోలీసు వ్య‌వ‌స్థ పూర్తిగా విఫ‌ల‌మైంద‌ని, పోలీసులు చ‌ట్టాన్ని మ‌ర్చిపోయార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.