విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి బీజేపీ మాట్లాడాలి.. గుండె రగిలిపోతుంది..
బీజేపీ నేతలపై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ మంగళవారం నిర్వహించే ప్రజాగ్రహా సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చెప్పాలని స్పీకర్ సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏపీ బీజేపీ నేతలు మాట్లాడాలని స్పీకర్ గుర్తు చేశారు.
విశాఖ ప్లాంట్‌కు గురించి ప్రధాని మోదీకి చెప్తే.. అందరం సంతోషిస్తామన్నారు. అదేవిధంగా రైల్వే జోన్, ప్రత్యేక హోదా గురించి కూడా బీజేపీ నేతలు మాట్లాడాలని స్పీకర్ సూచించారు. ఎందరో నాయకులు స్టీల్ ప్లాంట్ కోసం నాయకులు ప్రాణాలు అర్పించారని అన్నారు. ఏ వ్యక్తినో.. పార్టీలనో కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని.. ఏ కారణాలతో విభజన హామీలు నెరవేర్చలేకపోయారో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని స్పీకర్ అన్నారు.
విద్యార్థి నాయకుడిగా పనిచేసిన తన గుండె రగిలిపోతుందని ఆయన ఫైర్ అయ్యారు. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు తాను ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొన్నానని.. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కచ్చితంగా మాట్లాడాలని అన్నారు. మహానీయుల త్యాగాలు ప్రయివేటైజ్ చేయటానికా సభ అంటూ మండిపడ్డారు.