మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 డిశెంబరు 2021 (11:15 IST)

బీజేపీ నిరుద్యోగ దీక్షకు అనుమతి నిరాకరణ - హెడ్ ఆఫీసులోనే దీక్ష

తెలంగాణా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టదలచిన నిరుద్యోగ దీక్షకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో టీబీజేపీ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ హైదరాబాద్ నగరంలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలోనే దీక్షకు కూర్చొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో బండి సంజయ్ ఒక్క రోజు దీక్షకు పిలుపునిచ్చారు. 
 
అయితే, ఈ దీక్షపై పోలీసులు అనుమతి ఇవ్వలేదు కదా అనేక ఆంక్షలు విధించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 2వ తేదీ వరకు బహిరంగ సభలు, ర్యాలీలు నిషేధం అంటూ ప్రభుత్వం జీవో జారీచేసింది. 
 
కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఇందిరా పార్క్ వద్ద దీక్షకు అనుమతి ఇవ్వక పోవడంతో బీజేపీ ఆఫీసులోనే దీక్షకు కూర్చొన్నారు. అయితే,  ఈ దీక్షకు తరలివస్తున్న విద్యార్థి, నిరుద్యోగ సంఘాల నాయకులను, పార్టీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేస్తున్నారు.