శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 నవంబరు 2021 (16:45 IST)

బండి సంజయ్‌ కుమార్‌‌పై కేసు నమోదు...

బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌‌పై కేసు నమోదు చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. అనుమతి తీసుకోకుండా పర్యటన, శాంతి భద్రతలకు విఘాతం, ప్రజలు, రైతులకు ఇబ్బంది కలిగించే విధంగా జరిగిన పర్యటన నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులపై కేసులు నమోదు చేశామని ఎస్పీ రంగనాధ్ తెలిపారు.
 
రాజకీయ పార్టీల ప్రతినిధులు, నాయకులు ముందస్తు అనుమతులు తీసుకోకుండా పర్యటనలు, సమావేశాలు నిర్వహించవద్దని రంగనాధ్ సూచించారు. బండి సంజయ్ పర్యటన నేపధ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన బీజేపీ, టిఆర్ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో వీడియో ఆధారాలతో కేసులు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.