గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (16:07 IST)

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ కాన్వాయ్‌పై కోడిగుడ్ల దాడి

తెలంగాణ రాష్ట్ర బండి సంజయ్ కాన్వాయ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు గుడ్లు, రాళ్ళతో దాడికిపాల్పడ్డారు. నార్కెట్‌పల్లి అద్దంకి హైవేపై ఈ ఘటన జరిగింది. మిర్యాలగూడ వెళ్తుండగా ఈ దాడి జరిగింది. 
 
నల్గొండ మండలం ఆర్జలబావి ఐకేపీ సెంటర్ వద్ద రైతులతో ముఖాముఖీ ముగించుకుని మిర్యాలగూడ వెళ్తున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కాన్వాయ్‌పై గుడ్లతో, రాళ్లతో గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. 
 
అయితే, ఈ దాడికి పాల్పడింది టీఆర్ఎస్ శ్రేణులంటూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాన్వాయ్ పై దాడికి నిరసనగా నార్కెట్‌పల్లి అద్దంకి జాతీయ రహదారిపై బైఠాయించిన బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు.