నా ఫామ్ హౌజ్ వద్ద అడుగుపెడితే ఆరు ముక్కలు అయితవ్ బిడ్డా....
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌజ్‌ను ట్రాక్టర్‌తో దున్నేస్తానంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు.
"నా ఫామ్ హౌజ్ వద్ద అడుగుపెడితే ఆరు ముక్కలు అయితవ్ బిడ్డా అంటూ హెచ్చరించారు. అది గెస్ట్ హౌజ్ కాదు.. అది ఫార్మర్ హౌజ్.. అన్ని లంగ మాటలు మాట్లాడుతావ్" అంటూ మండిపడ్డారు.
దిక్కు మాలిన పాదయాత్ర చేసుకుంటూ.. కేసీఆర్ నీ ఫామ్ హౌజ్‌కు వచ్చి దున్నుతా అంటడు. ఏం బండి సంజయ్ నువ్ పార్టీని నడపడం వదిలి ట్రాక్టర్ నడుపుతున్నావా.. నీవు ట్రాక్టర్ డ్రైవర్ వా? అంటూ బండి సంజయ్‌కు సీఎం కేసీఆర్ చురకలంటించారు.
వంద ఎకరాల్లో నేను, నా కొడుకు బాజప్తాగా వ్యవసాయం చేసుకుంటున్నాం. మాకేం మనీలాండరింగ్‌లు, బొండరింగ్‌లు లేవు. మాకేం కంపెనీలు లేవు.. దందాలు లేవు. మాకేం బిజినెస్‌లు లేవు. దొంగ వ్యాపారాల్లేవు. మీరు మమ్మల్ని ఏం చేయలేరు. మేం నిజాయితిగా ఉన్నాం.. నిఖార్సుగా ఉన్నాం. ఎవరితోనైనా పోరాడుతాం. ఎవరికీ భయపడం అంటూ బండిపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు.
ఈ రాష్ట్రం కోసం కట్టిన ప్రాజెక్టుల్లో మా అత్తగారి పొలం, మా పొలంతో పాటు ఊర్లన్నీ మునిగిపోయాయి. మేం దొంగ సొమ్ముతో బతకం. అందుకే మేం దేనికి భయపడం. నా హద్దులను నిర్ణయించడానికి నీవు ఎవరు? అంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు
ఇప్పటికైనా మా ప్రాణం పోయే వరకు తెలంగాణ కోసం, రైతుల ప్రయోజనాల కోసం కొట్లాడుతాం. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనే వరకు పోరాడుతాం. మీరు వడ్లు కొనం అంటే మీకు ఓటేయ్యాలా? వద్దా? అనేది ప్రజలు నిర్ణయించుకుంటారని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.