గురువారం, 12 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 నవంబరు 2021 (20:30 IST)

బండి సంజయ్‌కు హోం మంత్రి అమిత్‌ షా ఫోన్‌..

హుజూరాబాద్‌ ఉప పోరులో భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ భారీ ఆధిక్యంలో దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

హైదరాబాద్‌ నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయం వద్దకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను భుజాలపైకి ఎత్తుకుని హర్షం వ్యక్తం చేశారు. 
 
బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. డప్పు వాయిద్యాలు మధ్య నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా బండి సంజయ్‌కు ఫోన్‌ చేసి అభినందనలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయటం వలనే హుజూరాబాద్‌లో భాజపా గెలుస్తోందని పేర్కొన్నారు. 
 
తెలంగాణలో ఎంతో ఉత్కంఠగా సాగుతున్న హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ సందర్భంగా ఆరా తీశారు. బండి సంజయ్‎కి ఫోన్ చేసి ఫలితాలు ఎలా వస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు