సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (12:58 IST)

జనరల్ బిపిన్ చేసిన సేవలు చిరస్మరణీయం: బండి సంజయ్

జనరల్ బిపిన్ రావత్​, మధులికా రావత్​ల పార్థీవ దేహాలకు తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన అపురూపమైన సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆయన అన్నారు.

 
కాగా గురువారం సాయంత్రం తమిళనాడు నుంచి సైనిక విమానంలో వారి పార్థివదేహాలను ఢిల్లీకి తరలించారు ఈరోజు బిపిన్ రావత్‌ అంత్యక్రియలు జరుగనున్నాయి. కామరాజ్ మార్గ్ ద్వారా కంటోన్మెంట్​లోని స్మశాన వాటిక వరకు అంతిమ యాత్ర సాగుతోంది.

 
తమమిళనాడులోని నీలగిరి జిల్లా కున్నూర్ సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో జనరల్ బిపిన్ రావత్​, ఆయన సతీమణి మధులికాలతో సహా 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.