గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (15:17 IST)

వ్యాక్సినేషన్‌లో తెలంగాణ కొత్త మైలురాయి - 4 కోట్ల మార్క్

తెలంగాణ రాష్ట్రం కోవిడ్ వ్యాక్సినేషన్‌లో సరికొత్త మైలురాయిని చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఏకంగా 4 కోట్ల డోసుల వ్యాక్సిన్లను వేసింది. అంటే ఇప్పటివరకు అర్హులైన 50 శాతం మందికి మొదటి డోస్ టీకాలను పంపిణీ చేశారు. అలాగే, రెండో డోస్ వ్యాక్సినేషన్‌లో 50 శాతం మేరకు పూర్తయిందని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
కాగా, తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా, జనవరి 16వ తేదీన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. అప్పటి నుంచి 165 రోజుల్లో కోటి డోసులను పంపిణీ చేశారు. 
 
ఆ తర్వాత మరో 78 రోజుల్లో రెండు కోట్ల డోసులు పూర్తి చేసింది. ఇక కేవలం 27 రోజుల్లో అంటే అక్టోబరు 23వ తేదీ నుంచి మరో కోటి డోసుల వ్యాక్సిన్లను పంపణీ చేసింది.