శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (14:08 IST)

బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న - కేసీఆర్ అత్యంత మోసకారి!

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ యాంకర్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ మంగళవారం భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేత తరుణ్ ఛుగ్ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఇతర బీజేపీ నేతలు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, చింతపండు నవీన్‌ను తెలంగాణ ప్రజలు తీన్మార్ మల్లన్నగా చేశారు. ఇపుడు భారతీయ జనతా పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు. అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, హరీశ్ రావు, కవితలను అమరవీరులను స్థూపానికి కట్టేస్తానని ప్రకటించారు 
 
తెలంగాణా రాష్ట్రంలో అత్యంత మోసకారి ఒక్క కేసీఆర్ అని ఆరోపించారు. తనపై 38 కేసులు పెట్టి కేసీఆర్ సాధించిందేంటని ప్రశ్నించారు. మున్ముందు తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం లేకుండా చేయడానికి తన వంతుగా కృషి చేస్తానని చెప్పారు.