శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (12:37 IST)

బీజేపీలో చేరాలంటూ డబ్బు ఆశ చూపుతున్నారు : ఆప్ ఎంపీ భగవత్ సింగ్

భారతీయ జనతా పార్టీపై పంజాబ్ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధ్యక్షుడు, ఎంపీ భగవత్ మన్ సంచలన ఆరోపణలు చేశారు. తనకు డబ్బుతో పాటు మంత్రివర్గంలో చోటు కల్పిస్తామంటూ బీజేపీ నేతలు ప్రలోభాలకు గురిచేశారని ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, బీజేపీలోకి రావాలంటూ ఆ పార్టీ సీనిర్ నేత ఒకరు తనకు డబ్బు ఆశ చూపించారని ఆరోపించారు. అలాగే కేంద్ర మంత్రివర్గంలో చోటుకల్పిస్తామని ప్రలోభ పెట్టారని చెప్పారు. అయితే, ఆ నేత పేరును సమయం వచ్చినపుడు వెల్లడిస్తానని చెప్పారు. 
 
అంతేకాకుండా, పంజాబ్ రాష్ట్రంలో ఉన్న తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిచారు. బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు తెరతీసిందని ఆరోపించారు. అయితే తనతో పాటు తన పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నటికీ అమ్ముడుపోమన్నారు. కాగా, పంజాబ్ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టిసారించింది.