గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (12:03 IST)

బీజేపీ కండువా కప్పుకోనున్న విఠల్‌

తెలంగాణ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు సిహెచ్ విఠల్‌ సోమవారం భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. తెలంగాణ ఐకాస ప్రధాన కార్యదర్శిగా, కో-ఛైర్మన్‌గా ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకపాత్ర పోషించారు. 
 
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం టీఎస్‌పీఎస్సీ సభ్యుడిగా నియమితులైన విఠల్‌ పదవీకాలం ఏడాది క్రితం ముగిసింది. ఆదివారమే ఢిల్లీకి చేరుకున్న విఠల్ జాతీయ నేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు.
 
మరోవైపు రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాల పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్‌ మార్చడాన్ని తప్పుబట్టారు.