ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (09:25 IST)

బస్సులో సాధారణ ప్రయాణికుడిలా సజ్జనార్... డబ్బులిచ్చి టిక్కెట్ కొనుగోలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా సంస్థ ఆర్టీసీ ఎండీగా సైబరాబాద్ మాజీ పోలీస్ కమిషన్ సజ్జనార్ కొనసాగుతున్నారు. ఈయన ఆర్టీసీ బస్సుల్లో నిత్యం ప్రయాణిస్తూ, ఆర్టీసీ బస్సు సేవలను మెరుగుపరిచేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు బస్సుల్లో సాధారణ ప్రయాణికుడిలా ప్రయాణం చేసిన ఆయన మరోమారు సాధారణ ప్రయాణికుడిగా మారారు. 
 
ప్రతి గురువారం టీఎస్ఆర్టీసీ బస్ డేగా పాటించాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. అలాగే, ఆయన కూడా సిటీ బస్సులో ప్రయాణించి, ప్రజల బాధలు అభిప్రాయాలు తెలుసుకున్నారు. హైదరాబాద్ నగరంలోని తన నివాసం నుంచి లక్డీకాపూల్ మీదుగా టెలిఫోన్ భవన్ వరకు ఆయన కానినడకన వచ్చారు. అక్కడ నుంచి మెహిదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సెక్కారు. 
 
సచివాలయం మీదుగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు బస్ భవన్‌కు చేరుకున్నారు. ఈ ప్రయాణం కోసం ఆయన స్వయంగా టిక్కెట్ కొనుగోలు చేశారు. అంతకుముందు ఆయన టెలిఫోన్ భవన్ బస్టాపులో ఉన్న ప్రయాణికుల కోసం సజ్జనార్ మాట్లాడారు. బస్సుల సమయపాలన, సిబ్బంది ప్రవర్తన, బస్సులో శుభ్రత, సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే, బస్సులో ప్రయాణించే విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకున్నారు.