సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 10 డిశెంబరు 2021 (07:41 IST)

ప్ర‌భాస్ ఇంటివాడు కాబోతున్నాడోచ్‌!

Prabhas
ఎప్ప‌టినుంచో ప్ర‌భాస్ అభిమానులు ప్ర‌భాస్‌ను ఓ ఇంటివాడుగా చూడాల‌ని ఆరాట‌ప‌డుతున్నారు. అంద‌రికంటే ముందుగా ఆయ‌న బాబాయ్ కృష్ణంరాజు ఇందుకోసం తెగ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. విష‌యం ఏమంటే, పెండ్లి చేసుకొనే ముందు కొంద‌రు ఇంటిని కొనుగోలు చేస్తుంటారు. ఆ త‌ర్వాత వివాహం. ఇప్పుడు ప్ర‌భాస్ కూడా అలానే వున్నాడు. ముందుగా బొంబాయ్‌లో మంచి ఇల్లు కొనుక్కున్నాడు. తాజాగా హైద‌రాబాద్‌లోని నాన‌క్‌రామ్ గూడా సినీ విలేజ్‌లో పెద్ద విల్లాను కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. 
 
ప్ర‌ముఖ బిల్డర్ రామేశ్వ‌రం క‌ట్టిస్తున్న విల్లాను కొన్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకోసం నాన‌క్ రామ్ గూడాలోని ఔట‌ర్ రింగ్ రోడ్డుకు ద‌గ్గ‌ర‌లో 120 కోట్ల‌తో రెండు ఎక‌రాలు కొన్నాడ‌ని తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌కు ద‌గ్గ‌ర‌గా వుంటుంద‌నీ, ట్రాఫిక్ పెద్దగా వుండ‌ని ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకున్నాడ‌ట‌. అంత‌కుముందు జూబ్లీహిల్స్‌లోని ఓ భ‌వంతిని కొనుగోలు చేశాడు. అక్క‌డ అభిమానుల తాకిడీతోపాటు ట్రాఫిక్ ర‌ద్దీ ఎక్కువ‌గా వుండ‌డంతో మారాల‌ని చూస్తున్నాడు.
 
ఈ స్థ‌లంలో త‌నకు అనుకూలంగా నిర్మించుకోనున్న‌ట్లు ఫిలింన‌గ‌ర్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు దాదాపు 200 కోట్ల రూపాయ‌లు వెచ్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే బాలీవుడ్ స్టార్ల‌కు ప్ర‌భాస్ పోటీ ఇచ్చేశాడు. ఎవ‌రూ అంద‌నంత ఎత్తుకు ఎదిగిపోయాడు. త్వ‌ర‌లో ఈ ఇంటివిష‌యమై క్లారిటీ రానుంది.