శుక్రవారం, 11 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (13:24 IST)

ముఖ్యమంత్రి సహాయ నిధికి హీరో ప్రభాసం రూ.కోటి విరాళం

ప్రకృతి వై పరీత్యాలు సంభవించినపుడల్లా ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ఆపన్నహస్తం అందిస్తుంటారు. తమకు తోచిన విధంగా ప్రముఖు సాయం చేస్తుంటారు. తాజాగా హీరో ప్రభాస్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం ప్రటించారు. 
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. దీంతో చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో వరదలు సంభవించాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఈ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక రకాలైన సహాయక చర్యలు చేపట్టింది. అలాగే, తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సెలెబ్రిటీలు తమ వంతు సాయంగా ఆర్థిక సాయం చేశారు. 
 
ఇలాంటివారిలో జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి తదితరులు రూ.25 లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. ఇపుడు ప్రభాస్ ఏకంగా రూ.కోటి విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించి తన పెద్ద మనస్సును చాటుకున్నారు. తమ డార్లింగ్ పెద్ద మనస్సుపై ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు.