బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (11:52 IST)

"రాధేశ్యామ్" నుంచి 'నగుమోము' వీడియో సాంగ్ రిలీజ్

ప్రభాస్ - పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న చిత్రం "రాధేశ్యామ్". సంక్రాంతికి విడుదల కానున్న ఈ భారీ బడ్జెట్, పాన్ ఇండియా మూవీ కోసం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్‌లో భాగంగా, తాజాగా ఆ చిత్రంలోని నగుమోము అనే వీడియో సాంగ్‌ను చిత్ర బృందం గురువారం విడుదల చేసింది. 
 
మనస్సును హత్తుకునేలా ఆహ్లాదకరంగా సాగుతున్నఈ పాటకు కృష్ణకాంత్ గేయరచన చేయగా, జస్టిన్ ప్రభాకరన్ సంగీత స్వరాలు సమకూర్చారు. సిధ్ శ్రీరామ్ ఆలపించారు. ఈ సాంగ్ ప్రారంభంలో "నువ్వేమైనా రోమియో అనుకుంటున్నావా" అని హీరోయిన్ పశ్నించగా, "ఛ.. నేను ఆ టైప్ కాదు.." అని హీరో చెబుతున్నాడు. 
 
"కానీ, నేను జూలియట్‌ను. నాతో ప్రేమలో పడితే చస్తావు" అని పూజ హెచ్చరిస్తుందని, "ఐ జస్ట్ వాంట్ ఫ్లర్టేషన్ షిప్ అంటూ బుగ్గపై హీరో ముద్దుపట్టే" సన్నివేశం బాగుంది. ఈ పాటను తెలుగు, తమిళం భాషల్లో సిధ్ శ్రీరామ్ పాడగా, కన్నడ, మలయాళ భాషల్లో సౌరాజ్ సంతోష్ గానాలాపన చేశారు. హిందీ సాంగ్‌ను ఆర్జిత్ సింగ్ ఆలపించారు. 
 
కాగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1980నాటి పారిస్ నేపథ్యంలో ప్రేమకథా చిత్రంగా తెరకెక్కింది. జ్యోతిష్యుడి పాత్రలో విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్డేలు నటించారు. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, సాషా చిత్ర ఇతర పాత్రలను పోషించారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళ భాషలతో పాటు.. చైనీస్, జపనీస్ భాషల్లో కూడా జనవరి 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.