గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (18:54 IST)

పొగ‌డ్త‌ల‌తో ముంచేసిన వ‌ర్మ - యుద్ధ విద్య‌కోసం క‌ష్ట‌ప‌డుతున్న మంచు ల‌క్ష్మీ

Manchu laxmi
Manchu laxmi
మంచు ల‌క్ష్మీ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో పాల్గొనేందుకు తెగ క‌స‌ర‌త్తులు చేస్తోంది. ముఖ్యంగా మ‌ల‌యాళ సినిమాలో న‌టించేందుకు సిద్ధ‌మైంది. కేర‌ళ యుద్ధ‌విద్య‌ల నేప‌థ్యంలో రూపొందుతున్న ఆ సినిమాకోసం శిక్ష‌ణ తీసుకుంటుంది. ఈ వీడియోల‌ను త‌న ఇన్‌స్ట్రా లో పోస్ట్ చేసింది. పురుషుల‌కంటే ధీటుగా ఆమె చేస్తున్న శిక్ష‌ణ వుంది.
 
తాజాగా మోహన్ లాల్ హీరోగా న‌టిస్తున్న‌‘మాన్ స్టర్‘ అనే చిత్రంలో ఆమె న‌టిస్తోంది. ఇందులో ఆమె పాత్ర చాలా ముఖ్య‌మైంద‌ట‌. కేరళకు చెందిన అతి పురాతన యుద్థకళ కలరిపయట్టు ను రాత్రీ పగలూ తేడా లేకుండా ప్రాక్టీస్ చేస్తోంది. దీని గురించి మొన్న‌నే వీడియో పెట్టింది. 
 
అయితే ఆ పోస్ట్‌ను వ‌ర్మ చూసి, ‘ఈమె ఎవరో గెస్ చేయండి?’ అంటూ నెటిజన్లు పరీక్ష పెట్టాడు. ఆ తర్వాత కాసేపటికే ఆమె మంచు లక్ష్మీ అనే విషయాన్ని రివీల్ చేస్తూ, పొగడ్తలలో ముంచెత్తాడు. ‘నువ్వు చేయలేని పని ఏదైనా అసలు ఉందా? నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను”అంటూ పొగిడేశాడు. దానికి మంచు లక్ష్మీ హర్షం వ్యక్తం చేస్తూ, ‘ఓ ఆర్టిస్టుగా నేను చేయలేనిది ఏదీ లేదు. అందుకే నన్ను నేను ఆర్టిస్టిక్ కిల్లర్ గా చెప్పుకుంటాను” అని బదులిచ్చింది.