ఓన్లీ సూపర్ స్టార్ ఆయనే అంటోన్న రామ్‌గోపాల్ వర్మ
Varma twitter
పైగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రజనీకాంత్, మహేష్ బాబు లాంటి హీరోలు కూడా పుష్పరాజ్ లాంటి పాత్రలు చేయలేరని వారిని ట్యాగ్ చేస్తూ ఆర్జీవీ ట్వీట్ చేశాడు. అంతే కాకుండా ఇలాంటి పాత్రలు చేయగలరా అంటూ వారికి సవాల్ విసిరాడు. అలాగే చివరిగా పుష్ప అంటే ఫ్లవర్ కాదు.. ఫైర్ అంటూ పుష్ప మూవీ ట్రైలర్‌లోని డైలాగ్‌ను పోస్ట్ చేశాడు.
ఇక నెటిజన్లు వర్మ కామెంట్‌కు ఆశ్చర్యపోయినా ఫిదా అయ్యారు. అందుకు ఆయన కామెంట్ కు లైక్ బాగానే వచ్చాయి. ఇక ఇందులో రెండు నిమిషాల 31 సెకెండ్ల ప్రమోలోనే ప్రతి సీన్ కూడా కథ గురించి ఆలోచింపచేసేలా ఉందని చెప్పారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 17న విడుదల కానుంది.
తర్వాతి కథనం
