మంగళవారం, 12 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 డిశెంబరు 2021 (08:16 IST)

బన్నీ-స్నేహారెడ్డిల కోపం... అలిగింది.. పుట్టింటికి వెళ్ళిపోయింది..

భార్యాభర్తల మధ్య గొడవలు సర్వసాధారణం. సామాన్య దంపతులే కాదు.. పెద్ద సెలబ్రిటీ దంపతుల మధ్య కూడా గొడవలు మామూలే. ఇలాంటి గొడవే బన్నీ, స్నేహారెడ్డిల మధ్య చోటుచేసుకుంది. గతంలో ఒకసారి అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డిపై చిరుకోపం ప్రదర్శించారు. 
 
దీంతో ఎంతో హర్ట్ అయిన స్నేహ రెడ్డి బుంగమూతి పెట్టుకుని అలిగింది. అంతేగాకుండా స్నేహారెడ్డి అల్లు అర్జున్‌తో గొడవపడి తన పుట్టింటికి వెళ్లిపోయినట్టు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
 
అయితే ఇలాంటివన్నీ భార్యాభర్తల మధ్య సర్వసాధారణమే. ఎన్ని గొడవలు జరిగిన ఒకరినొకరు అర్థం చేసుకుంటే భార్యాభర్తల మధ్య బంధం ఎంతో బలంగా ఉంటుందని ఈ భార్యాభర్తలను చూస్తే అర్థమవుతుంది. 
 
ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉండటం వల్ల స్నేహ రెడ్డి తన పిల్లల బాధ్యతలను ఎంతో చక్కగా నిర్వర్తిస్తుంది. అల్లు అర్జున్ కూతురు అర్హ కూడా శాకుంతలం సినిమా ద్వారా వెండితెరపై సందడి చేయబోతోంది.